రక్తదానం ఎవరికి ఎవరు చేయొచ్చు? ప్రపంచంలో ఏ బ్లడ్ గ్రూప్ ఎక్కువ?
- ప్రపంచవ్యాప్తంగా O పాజిటివ్ అత్యంత సాధారణ బ్లడ్ గ్రూప్
- ఐరోపాలో A పాజిటివ్, ఆసియాలో B పాజిటివ్ గ్రూపుల ప్రాబల్యం
- O నెగెటివ్ యూనివర్సల్ డోనర్, AB పాజిటివ్ యూనివర్సల్ రెసిపియెంట్
- ప్రపంచ జనాభాలో Rh నెగెటివ్ రక్తం ఉన్నవారు కేవలం 7శాతం మాత్రమే
జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం ముగిసిన నేపథ్యంలో, రక్తం గ్రూపులకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ డేటా సంస్థ 'స్టాటిస్టా' విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ గ్రూప్‌ల లభ్యతలో ప్రాంతాల వారీగా గణనీయమైన తేడాలు ఉన్నాయి.
ప్రాంతాల వారీగా తేడాలు
ప్రపంచంలో అత్యంత సాధారణమైన బ్లడ్ గ్రూప్ 'O పాజిటివ్' (O+) కాగా, అనేక దేశాల్లో ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. ఉదాహరణకు, ఐరోపా దేశాల్లో 'A పాజిటివ్' (A+) రక్తం గలవారు ఎక్కువగా ఉన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో 'B పాజిటివ్' (B+) గ్రూప్ అధికంగా కనిపిస్తుంది.
దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్, పెరూ వంటి దేశాల్లో జనాభాలో 70 శాతం మందికి పైగా ‘O’ పాజిటివ్ వారే కావడం విశేషం. జింబాబ్వేలో సుమారు 63 శాతం మంది ఇదే గ్రూపునకు చెందినవారు. అమెరికాలో ‘O’ పాజిటివ్ (37.4 శాతం), A పాజిటివ్ (35.7 శాతం) దాదాపు సమానంగా ఉన్నాయి. ఇక భారత్, చైనా వంటి ఆసియా దేశాల్లో ‘O’ పాజిటివ్‌తో పాటు B పాజిటివ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచ జనాభాలో Rh నెగెటివ్ గ్రూపులు చాలా అరుదుగా, 7 శాతం మాత్రమే ఉన్నాయి.
ఎవరు ఎవరికి రక్తదానం చేయొచ్చు?
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెమటాలజీ డేటా ప్రకారం.. రక్తం సరిపోవడం (కంపాటబిలిటీ) అనేది ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఆ నియమాలు ఇవిగో:
‘O’ నెగెటివ్ (O-): వీరు అన్ని రక్త వర్గాల వారికి రక్తదానం చేయొచ్చు. అందుకే వీరిని 'యూనివర్సల్ డోనర్స్' (విశ్వదాతలు) అంటారు. కానీ వీరు ‘O’ నెగెటివ్ నుంచి మాత్రమే రక్తాన్ని స్వీకరించగలరు.
AB పాజిటివ్ (AB+): వీరు అన్ని గ్రూపుల నుంచి రక్తాన్ని స్వీకరించగలరు. అందుకే వీరిని 'యూనివర్సల్ రెసిపియెంట్స్' (విశ్వ గ్రహీతలు) అంటారు.
‘O’ పాజిటివ్ (O+): వీరు O+, A+, B+, AB+ గ్రూపులకు దానం చేయవచ్చు.
A పాజిటివ్ (A+): A+, AB+ గ్రూపులకు దానం చేయవచ్చు.
B పాజిటివ్ (B+): B+, AB+ గ్రూపులకు దానం చేయవచ్చు.
రక్తదానం ప్రాముఖ్యత
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జూన్ 12న విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2023లో ప్రపంచవ్యాప్తంగా సేకరించిన 120 మిలియన్ల రక్త యూనిట్లలో 85 శాతం పైగా స్వచ్ఛంద, ప్రతిఫలం ఆశించని దాతల నుంచే వచ్చాయి. ఇది గణనీయమైన పురోగతి అయినప్పటికీ, అనేక ప్రాంతాల్లో రక్తం కొరత ఇప్పటికీ ఉంది. రెడ్ క్రాస్ వంటి సంస్థలు రక్తదానంపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నాయి.
అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం విలువైనదే. అందుకే ప్రతి ఒక్కరూ తమ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడమే కాకుండా, అర్హులైన వారు క్రమం తప్పకుండా రక్తదానం చేయడం ద్వారా ఒకేసారి ముగ్గురి ప్రాణాలను కాపాడగలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.